Rashmi Gautam: ఒక్క పాటకి అన్ని లక్షలు డిమాండ్ చేస్తున్న రష్మి

మెగాస్టార్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జబర్దస్త్ యాంకర్

admin1
Published on: 9 Dec 2021 3:02 PM IST
Rashmi Gautam Remuneration In Chiranjeevi Bhola Shankar Movie Special Song
X

మెగాస్టార్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జబర్దస్త్ యాంకర్ (ఫైల్-ఫోటో)

Rashmi Gautam: రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "బోళా శంకర్". అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పులు చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అది ఒక పూర్తి మాస్ మసాలా పాట గా ఉండబోతుందట.

తాజా సమాచారం ప్రకారం ఈ పాటలో డాన్స్ చేస్తున్నందుకు రష్మీ కి భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క పాట కి డాన్స్ చేసినందుకు రష్మి గౌతమ్ దాదాపు 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇక రెమ్యునరేషన్ మాట పక్కన పెడితే అసలే సినిమాలు లేని రష్మి గౌతమ్ కి మెగాస్టార్ సరసన స్టెప్పులేయడం అంటే గోల్డెన్ ఆఫర్ అని చెప్పుకోవాలి. మరి చిరు తో ఈ పాట రష్మి కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నారు రామ్ చరణ్.

admin1

admin1

Next Story