Rashmi Gautam: నాగార్జున మూవీలో రష్మీ?

Rashmi Gautam Plays Key Role in Nagarjuna and Praveen Sattaru Movie
x

Rashmi: (Photo: The Hans India) 

Highlights

Rashmi Gautam: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున చేయబోతున్న సినిమాలో రష్మీ నటించబోతున్నట్లు టాలీవుడ్ టాక్.

Rashmi Gautam: అనసూయతో సినిమాల్లోనూ రష్మీ పోటీ పడేలా ఉంది. ఆ సినిమా ఈ సినిమా కాదు.. ఏకంగా నాగార్జున మూవీలోనే ఛాన్స్ కొట్టేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున చేయబోతున్న సినిమాలో రష్మీ నటించబోతున్నట్లు టాక్. ప్రవీణ్ సత్తారుతో గుంటూరు టాకీస్ మూవీ చేసిన రష్మీకి.. ఈ ఛాన్స్ దక్కినట్లు చెప్పుకుంటున్నారు.

జబర్థస్త్ ఫేం యాంకర్ రష్మీకి యూత్ లో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. నాయిక ప్రధానమైన హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా చేసింది. అయితే ఆ సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఆమెకి స్సక్సెస్ ను తెచ్చిపెట్టాయి.. మిగతా సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఒక వైపున సినిమాలపై దృష్టి పెడుతూనే, బుల్లితెరపై ఆమె తన జోరును కొనసాగిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా 'గోవా'లో మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మీని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారుతో సినిమాను వాయిదా వేసుకున్నాడనే ప్రచారం కూడా నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories