Rashmi Gautam: రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ యాంకర్

Rashmi Gautam: అందుకే పెళ్లి విషయాన్ని దాస్తున్నారా రష్మి

admin1
Updated on: 23 Jan 2022 7:15 AM IST
Rashmi Gautam Got Married Secretly? | Tollywood News
X

అందుకే పెళ్లి విషయాన్ని దాస్తున్నారా రష్మి

Rashmi Gautam: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో రష్మి గౌతమ్ పేరు కూడా ముందే ఉంటుంది. ఢీ, జబర్దస్త్ షోలతో ఈమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మరోవైపు సినిమాలలో కూడా అడపాదడపా పాత్రల్లో కనిపిస్తూ అందరినీ అలరిస్తోంది రష్మి. తాజా సమాచారం ప్రకారం రష్మి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన ఒక ఐటెం సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పులు వేయబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే తాజాగా రష్మి గౌతమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లాక్ డౌన్ లో రష్మీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. యాంకర్ సుధీర్ మరియు రష్మీ ల ప్రేమ కథ చాలా కాలం గా నడుస్తూనే ఉంది. తాము స్నేహితులం మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని పుకార్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రష్మి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తన పెళ్లి వార్తను ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ తనకి పెళ్లి అయిపోయింది అని తెలిస్తే అవకాశాలు తగ్గుతాయి ఏమోనని భయంతోనే ఈ విషయాన్ని దాస్తున్నట్లు కొందరు సందేహం పడుతున్నారు.

admin1

admin1

Next Story