Rashi Khanna: బంపర్ ఆఫర్ అందుకున్న రాశి ఖన్నా

Rashi Khanna: హిందీ లో బడా ప్రాజెక్ట్ సైన్ చేసిన రాశి ఖన్నా

admin1
Published on: 18 Nov 2021 9:20 PM IST
Rashi Khanna Signs a Big Project in Hindi
X

రాశి ఖన్నా (ఫైల్ ఇమేజ్)

Rashi Khanna: సౌత్ ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లను అందుకుంటూ కొరియర్లు ముందుకు దూసుకెళ్తున్న హీరోయిన్ రాశి కన్నా ఒకవైపు తెలుగులో మాత్రమేకాక మరోవైపు హిందీలో కూడా ఈమె తన ప్రతిభను చాటి చెబుతోంది తాజాగా 2 హిందీ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకుంది రాశిఖన్నా. స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా "సన్నీ" అనే ఒక వెబ్ సిరీస్ లో కనిపించబోతున్న రాశిఖన్నా సీనియర్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి "రుద్ర" అనే వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ "ఊహలు గుసగుసలాడే" బ్యూటీ.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఒక ఆక్షన్ ఫ్రాంచైజ్ లో లీడ్ క్యారెక్టర్ కోసం రాశి ఖన్నా నీ సంప్రదించగా ఆమె వెంటనే ఒప్పుకుంది. ఫ్రాంచైజ్ అంటేనే ఈ సినిమా పలు భాగాలుగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇలాంటి ఫ్రాంచైజ్ లీడ్ పాత్ర దొరకడం చాలా అదృష్టం అని చెప్పాలి. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రలలో కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి 'యోధ' అనే టైటిల్ను అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు.

admin1

admin1

Next Story