Rashi Khanna: స్టైలిష్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది

* అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాట బయట పెట్టిన రాశిఖన్నా

admin1
Updated on: 6 Oct 2021 7:01 PM IST
Rashi Khanna Says i Want to do Movie With Allu Arjun
X

అల్లు అర్జున్ - రాశి ఖన్నా (ఫైల్ ఫోటో)

Rashi Khanna: "ఊహలు గుసగుసలాడే" సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన రాశిఖన్నా మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమైన రాశి ఖన్నా తాజాగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఎవరితో తనకి సినిమా చేయాలని ఉంది అని అడగగా రాశి ఖన్నా వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తనతో వర్క్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

అయితే అభిమాన హీరో గురించి అడగగా అందరు హీరోలు తనకి ఇష్టమేనని కానీ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు అంటే తనకి విపరీతమైన ఇష్టం అని చెప్పింది రాశిఖన్నా. అంతేకాకుండా బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి తన ఫేవరెట్ హీరోయిన్ అని రాశి ఖన్నా ఈ మధ్యనే "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమా లో కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు తెలుగులో "పక్కా కమర్షియల్" మరియు "థాంక్యూ" సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు తమిళం, మలయాళం లో కూడా సినిమా షూటింగులతో బిజీగా ఉంది రాశిఖన్నా.

admin1

admin1

Next Story