నాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా

Rashi Khanna: నాగచైతన్య కోసం బెండ్ అయిన రాశి ఖన్నా

Jyothi
Published on: 26 Jun 2022 9:53 AM IST
Rashi Khanna Saying Naga Chaitanya Gentle Man
X

నాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా

Rashi Khanna: "ఊహలు గుసగుసలాడే" సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ రాశిఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమధ్యనే "వెంకీ మామ" సినిమాలో కనిపించిన ఈ భామ తాజాగా ఇప్పుడు గోపీచంద్ సరసన "పక్కా కమర్షియల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న "థాంక్యు" సినిమాలో కూడా రాశి ఖ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని జూలై 8 న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని జూలై 22 కి వాయిదా వేశారు.

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య మరియు రాశి ఖన్నా మీడియా ముందుకి వచ్చారు. అయితే రాశి కన్నా నాలుగు ఇంచులు హైట్ ఉన్న హై హీల్స్ వేసుకుని నాగచైతన్య తో ఫోటో లకు పోజులిచ్చింది. అయితే నాగచైతన్య తన పక్కన పొట్టి గా కనిపిస్తూ ఉండటంతో నాగచైతన్య వద్దని వారించినప్పటికీ రాశి ఖన్నా కొంచెం బెండ్ అయ్యి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం తో అభిమానులు నవ్వుతున్నారు. హై హీల్స్ వేసుకోవడం వలన తాను బెండ్ అవ్వాల్సి వచ్చిందని కానీ చై మాత్రం అలాంటి అవసరం లేదని మామూలుగానే నిలబడమని జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసింది ఈ భామ.

Jyothi

Jyothi

Next Story