సంక్రాంతి తరువాత తన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న రాశి ఖన్నా

* తమిళంలో ప్రముఖ నటుడు జీవా ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నారు

admin1
Published on: 9 Nov 2021 1:37 PM IST
Rashi Khanna New Movie Shooting will Sets up after Sankranthi in 2021
X

రాశి ఖన్నా(ఫోటో- ది హన్స్ ఇండియా)

Rashi Khanna: తెలుగులో కంటే ఈ మధ్య రాశి ఖన్నా తమిళంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యనే రాశి ఖన్నా తమిళ్ లో రెండు సినిమాలను విడుదల చేసింది. అందులో ఒకటి "తుగ్లక్ దర్బార్" కాగా రెండవది "అరన్మనై 3". కామెడీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు రాశి ఖన్నా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సుందర్.సి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఒప్పుకుంది. తమిళంలో ప్రముఖ నటుడు జీవా ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి మధ్యలో నుంచి మొదలు కాబోతోంది. మరోవైపు రాశిఖన్నా తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా "పక్కా కమర్షియల్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాశి ఖన్నా మరోవైపు నాగచైతన్య హీరోగా వస్తున్న "థాంక్యూ" సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇవే కాక రాశిఖన్నా హిందీ లో కూడా షాహిద్ కపూర్ మరియు అజయ్ దేవగన్ తో కలిసి నటిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కనిపించనుంది.

admin1

admin1

Next Story