Rao Ramesh: భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న రావు రమేష్

Rao Ramesh: ప్రస్తుతం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో రావు రమేష్ పేరు ముందే ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగి పోగల టాలెంట్ ఉన్న నటుడు రావు రమేష్.

admin1
Published on: 18 Aug 2021 6:15 PM IST
Rao Ramesh Getting Huge Pay For Nayattu Remake
X

Rao Ramesh: భారీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న రావు రమేష్

Rao Ramesh: ప్రస్తుతం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో రావు రమేష్ పేరు ముందే ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగి పోగల టాలెంట్ ఉన్న నటుడు రావు రమేష్. అటు విలన్ పాత్రులైనా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా సరే తేడా లేకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు రావు రమేష్. ఈ నేపథ్యంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో రీమేక్ అవుతున్న నాయట్టు సినిమాలో కూడా రావు రమేష్ ముఖ్య పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంజలి, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలలో కనిపించనున్న ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కనుంది. అయితే ఈ సినిమాకి గాను రావు రమేష్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

తాజా సమాచారం ప్రకారం రావు రమేష్ ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర దాకా రెమ్యూనరేషన్ ను తీసుకోబోతున్నారట. ఆయన ఈ సినిమా కోసం కేటాయించిన రోజులను చూస్తే ఇది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ రావు రమేష్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. "పలాస" ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమా మాత్రమే కాక రావు రమేష్ మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story