Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్‌.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Rao Ramesh as Gooni Babji in Maha Samudram
x

మహాసముద్రం సినిమాలో గూని బాబ్జీగా రావు రమేశ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో రానున్న సినిమా 'మహాసముద్రం'.

Maha Samudram:ర్వానంద్, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో రానున్న సినిమా 'మహాసముద్రం'.ఈ సినిమాను 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్నాడు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కి బ్రహ్మాండమైన స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విలక్షణ నటుడు రావు రమేశ్‌ లుక్‌ని నేడు విడుదల చేశారు మూవీ టీం. రావు రమేశ్ పుట్టిన రోజు(మే 25)సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రావు రమేశ్‌ టక్ వేసుకుని సీరియస్‌గా కనిపించాడు.

ఇందులో గూని బాబ్జీగా కీలక పాత్రలో రావు రమేశ్‌ నటిస్తున్నట్లు వెల్లడించారు. పేరుకు తగ్గట్టే ఆయన గూని తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర వ్యంగ్యంతోపాటు నెగెటివ్ షేడ్స్ లో సాగనుందంట. యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories