ఊ అంటావా పాట నాకు చాలా ఇష్టం అంటున్న రణ్వీర్ సింగ్

*ఊ అంటావా పాట నాకు చాలా ఇష్టం అంటున్న రణ్వీర్ సింగ్

Rama Rao
Updated on: 13 May 2022 12:01 PM IST
Ranveer Singh Says I Like the Song Oo Antava Mava | Movie News
X

ఊ అంటావా పాట నాకు చాలా ఇష్టం అంటున్న రణ్వీర్ సింగ్

Ranveer Singh: ఈ మధ్యనే కన్నడ నటుడు కిచ్చ సుదీప్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు అని చెప్పటం దానికి బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ట్విట్టర్ ద్వారా కౌంటర్లు వేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా నటులు మరియు డైరెక్టర్లు కూడా ఈ డిబేట్ లో పాల్గొని ఇండస్ట్రీ గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలు అన్నీ తనకి ఒక్కటేనని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తాను ఏ రోజు భాషని బట్టి సినిమాని చూడలేదని ఎప్పుడు ఇండియన్ సినిమా గానే చూశానని మన దేశంలో ఉన్న భాషలు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అని అన్నారు. "ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలలో నాకు బాగా నచ్చిన పాట ఊ అంటావా. అది విన్నప్పుడల్లా నాకు పిచ్చి ఎక్కినట్టు ఉంటుంది. లిరిక్స్ పక్కన పెట్టినా ఆ మ్యూజిక్ నన్ను టచ్ చేసినట్టు అనిపిస్తుంది" అని అన్నారు రణ్వీర్ సింగ్.

ఎలా అయితే సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఒక భాగమో హిందీ సినిమా కూడా అంతేనని అన్న రణ్వీర్ సింగ్ తనకి వేరే భాషల్లో కూడా నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ఇక ప్రస్తుతం రణ్వీర్ సింగ్ తన తదుపరి సినిమా జయేష్ భాయ్ జోర్దార్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 13న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story