Ranveer Singh: హిట్ కోసం సూట్ కాని రూట్లో రణ్ వీర్ సింగ్

Ranveer Singh: రణ్ వీర్ సింగ్ బాలీవుడ్ లో ఒకప్పుడు ఊపేశాడు.

Arun Chilukuri
Updated on: 22 Jun 2023 9:30 PM IST
Ranveer Singh Goes With Odd Stories For Hit
X

Ranveer Singh: హిట్ కోసం సూట్ కాని రూట్లో రణ్ వీర్ సింగ్

Ranveer Singh: రణ్ వీర్ సింగ్ బాలీవుడ్ లో ఒకప్పుడు ఊపేశాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. సింగిల్ హిట్ కోసం ప్రయోగాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. మొన్నటి వరకు రణ్ బీర్ కపూర్ పరిస్థితి ఇలా ఉండేది..కాని ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కి అలాంటి బ్యాడ్ టైం నడుస్తోంది. గుడ్ టైం కోసం తనకి సూట్ కాని రూట్ ని రణ్ వీర్ సింగ్ ఎంచుకోవాల్సి వచ్చింది.

రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ టీజర్ చూసిన జనానికి ఒకే ఒక్క డౌట్ వస్తోంది. అసలు రణ్ వీర్ సింగ్ కి ఏమైంది? రౌడీ స్టార్ విజయ్ కి బాలీవుడ్ వర్షన్ కమ్ సీనియర్ అనిపించుకున్న రణ్ వీర్ సింగ్ హిట్ కోసం సూట్ కాని రూట్లో వెళుతున్నాడు. గత కొంతకాలంగా రణ్ వీర్ సింగ్ ఏం చేసినా కలిసి రావట్లేదు. సర్కస్ ఫీస్టు చేసినా పంచ్ పడింది. జయేష్ భాయ్ జోర్దార్ అంటూ ప్రయోగం చేసినా చేతులు కాలాయి.

83 లాంటి బయోపిక్ కూడా రణ్ వీర్ సింగ్ కి పంచ్ ఇచ్చింది. అసలు తను ఏం చేసినా బెడిసి కొడుతూనే ఉంది. అందుకే క్లాస్, మాస్, కామెడీ ఏ రూట్లో వెళ్లాలో తేల్చుకోలేక ఫ్యామిలీ డ్రామాకి సై అన్నాడు రణ్ వీర్ సింగ్. నిజానికి తన లాస్ట్ హిట్ అంటే సూర్యవంశీనే కాని, ఇది కూడా పూర్తిగా తన మూవీ అనలేం. తనది గెస్ట్ రోల్ గా మాత్రమే కన్సిడర్ చేయగలం. సో గల్లి బాయ్ తర్వాత సాలిడ్ హిట్ ఎలా ఉంటుందో చూడలేకపోయాడు రణ్ వీర్ సింగ్.. ఇప్పుడు హిట్ కోసం తిరిగి తిరిగి ఫ్యామిలీ డ్రామాకే సై అనాల్సి వచ్చింది.

ఆలియా తో కలిసి రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ అంటూ ప్రయోగం చేస్తున్నాడు రణ్ వీర్ సింగ్. ఇది నైంటీస్ కథని, ఇప్పటి ట్రెండ్ కి అనుగునంగా తీస్తున్నారనే టాక్ వస్తోంది. ఏదేమైనా హిట్ గేట్ తెరిచేందుకు రణ్ వీర్ సింగ్ ఆఖరి పోరాటం చేస్తున్నాడనే మాటే వినిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story