Mahesh Babu-Ranveer Singh: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబును ఓ రేంజ్‌లో పొగిడిన బాలీవుడ్ టాప్ హీరో

Mahesh Babu-Ranveer Singh: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబును ఓ రేంజ్‌లో పొగిడిన బాలీవుడ్ టాప్ హీరో
x
Highlights

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో బాలీవుడ్ యువ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ క‌లిసి న‌టించారు.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ హీరోలను బాలీవుడ్ న‌టీన‌టులు పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయు. ఇక్క‌డి తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాల‌తో పోటీ ప‌డుతున్నాయి. తెలుగు నటీనటులు బాలీవుడ్ హీరోహీరోయిన్లతో కంటే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తెలుగు వారితో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఇటీవ‌ల‌ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో బాలీవుడ్ యువ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ క‌లిసి న‌టించారు. ఓ కంపెనీ యాడ్ కోసం వీరిద్దు క‌లిసి న‌టించారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌తో తీసుకున్న ఫొటోను సామాజిక మాద్యమంలో ర‌ణ్‌వీర్ పోస్ట్ చేశారు.

అంతేకాకుండా మహేశ్ ను పొగుడుతూ.. క్యాప్షన్ ఇచ్చారు. నేను ప‌నిచేసిన వారిలో గొప్ప జంటిల్ మ‌న్‌. మా ఇద్ద‌రి మధ్య సంభాష‌ణ‌లు ఎప్పుడూ గొప్ప‌గా ఉంటాయి. ల‌వ్ అండ్ రెస్పెక్ట్ టు బిగ్ బ్ర‌ద‌ర్ మ‌హేష్ బాబు అని ఓ పేర్కొన్నారు. మ‌రోవైపు ర‌ణ్‌వీర్‌తో కలిసి ప‌నిచేయ‌డంపై మ‌హేష్ కూడా త‌న అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియాలో చెప్పారు. మీతో ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని మ‌హేష్ పోస్ట్ పెట్టారు. కాగా.. ఈ ఫొటో ఇరువురి ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు. రణ్‌వీర్‌కి థ్యాంక్స్ చెబుతూ సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ వారు కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. ఇక రణ్‌వీర్ సింగ్ నటించిన 83, జయేష్ భాయ్ జోర్దార్ , సూర్యవంశీ, చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నాయి. మహేశ్ సరసన మహానటి కీర్తి సురేష్ ఆడిపాడనుంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ షూటింగ్ వ‌చ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories