Rangde Collections: రంగ్ దే సెకండ్ డే కలెక్షన్స్

Rang De: నితిన్ రంగ్ దే బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Samba Siva Rao
Published on: 28 March 2021 2:40 PM IST
Rangde Collections
X

 'రంగ్ దే'

Rang De: యువ హీరో నితిన్, కీర్తి సురేష్ హీరోహీయిన్లగా నటించిన చిత్రం 'రంగ్ దే'. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం( మార్చి 26)న విడుదలైంది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు

ఈ సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ బజ్ తెచ్చుకునన్న రంగ్ దే. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు 3.65 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఏకంగా రెండో రోజు 2 కోట్ల నుంచి 2.2 కోట్ల వసూళ్లు వస్తాయని భావించినా.. ఊహించని విధంగా రంగ్ దే రెండో రోజు 2.54 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 15 కోట్లు షేర్ రాబట్టాలి. రంగ్ దే బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాను టోటల్ గా 23.9 కోట్లకు అమ్మగా.. 24.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. దీంతో మొదటి 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా ఈ సినిమా మరో 15.99 కోట్ల షేర్ ని సాధిస్తే.. జరిగిన బిజినెస్‌కు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాని సమాచారం.జీ నెట్వర్క్ (జీ తెలుగు అండ్ జీ 5) 10కోట్ల రూపాయలు పెట్టి సినిమాను కోనుగోలు చేసినట్లు ప్రచారం సాగతుంది.

నిజాం: 2.67Cr

సీడెడ్: 93L

యూఏ-36L

ఈస్ట్: 68L

వెస్ట్: 41L

గుంటూరు: 85L

కృష్ణ: 37L

నెల్లూరు: 33L

ఏపీ తెలంగాణ మొత్తం:- 7.16CR (10.81Cr~ Gross)

కర్నాటక: 45L

ఒవర్సీస్ – 90L

Total World wide : 8.51CR (14.10Cr~ Gross)


Samba Siva Rao

Samba Siva Rao

Next Story