Rang De: 'రంగ్ దే'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Rang De: ‘రంగ్ దే’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. జీ5లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు.

Venkata Chari
Updated on: 28 May 2021 11:31 PM IST
Rang De OTT Release Date Fix
X

రంగ్‌ దే (ఫొటో ట్విట్టర్)

Rang De: 'రంగ్ దే' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ప్ర‌ముఖ ఓటీటీ జీ5లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. మీరు ఎంత‌గానో ఎదురుచూస్తోన్న రంగు రంగుల ప్రేమ ఇంద్ర‌జాలం 'రంగ్ దే' జూన్‌ 12 నుంచి జీ 5లో మాత్ర‌మే.. అని ట్వీట్‌ లో రాసుకొచ్చారు.

నితిన్‌, కీర్తి సురేశ్ జంట‌గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. మార్చి 26న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తాకొట్టింది. పబ్లిక్ టాక్ బాగానే ఉన్నా.. కలెక్షన్స్‌ను మాత్రం సాధించలేకపోయింది.


Venkata Chari

Venkata Chari

Next Story