Rang De Censor Report: రొమాన్సే కాదు.. ఫుల్ కామోడీతో నవ్విస్తారంట..

Rang De Censor Report: యంగ్ హీరో నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 19 March 2021 8:12 PM IST
Rang De Censor Report: Full comedy in Nithiins Rang De Movie
X

రంగ్ దే సినిమా సెన్సార్ టాక్ (ఫొటో ట్విట్టర్)

Rang De Censor Report: యంగ్ హీరో నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితంతో కొంత నిరాశ చెందినా.. వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'రంగ్ దే' సినిమా మార్చి 26న విడుదల కానుంది. సినిమాతో వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై వస్తున్న ఈ మూవీలో నితిన్ తో రోమాన్స్ చేసింది కీర్తి సురేష్.

అయితే రంగ్ దే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వడంతో.. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్‌గా స్పందించారట. చిత్రంలో రొమాంటిక్ సీన్స్‌తో పాటు కామెడీ సీన్స్ అదిరిపోయాయని టాక్ వినిపిస్తోంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'తొలిప్రేమ', 'మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించాడు డైరెక్టర్. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

రంగ్ దే మూవీ నితిన్ కెరీర్‌లో 29వ సినిమా. 'గివ్ మీ స‌మ్ ల‌వ్‌' అనే ట్యాగ్ లైన్‌తో రాబోతుంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన అన్ని సినిమా అప్‌డేట్స్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు.


Venkata Chari

Venkata Chari

Next Story