logo
సినిమా

Ranbir Kapoor: రాఖీ బాయ్ తరహా పాత్రలో రణబీర్ కపూర్

Ranbir Kapoor and Rashmika Mandanna are shooting for Animal in Manali
X

Ranbir Kapoor: రాఖీ బాయ్ తరహా పాత్రలో రణబీర్ కపూర్

Highlights

Ranbir Kapoor: "అర్జున్ రెడ్డి" సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా ఈ మధ్యనే బాలీవుడ్ లో "కబీర్ సింగ్" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Ranbir Kapoor: "అర్జున్ రెడ్డి" సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా ఈ మధ్యనే బాలీవుడ్ లో "కబీర్ సింగ్" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా స్టార్ హీరో రణబీర్ కపూర్ తో "యానిమల్" సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్ వెంటనే సినిమా షూటింగులతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కోసం చిత్రబృందం మనాలి వెళ్లినట్లుగా తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ మరియు రష్మిక ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణబీర్ కపూర్ ని చాలా సరికొత్తగా చూపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్ కి తగ్గట్టు గానే రణబీర్ కపూర్ పాత్ర ఉంటుందని కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ తరహా పాత్ర ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అలాంటి పాత్రలో రణబీర్ కపూర్ ను ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Web TitleRanbir Kapoor and Rashmika Mandanna are shooting for Animal in Manali
Next Story