logo

ముంబై కి షిఫ్ట్ అవబోతున్న తెలుగు హీరో

ముంబై కి షిఫ్ట్ అవబోతున్న తెలుగు హీరో
Highlights

రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సరికొత్త కాన్సెప్ట్ సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ...

రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సరికొత్త కాన్సెప్ట్ సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న హీరో రానా దగ్గుబాటి. ఒకవైపు తెలుగులోనే కాక మరొక వైపు బాలీవుడ్ మరియు మిగతా భాషల్లో కూడా తన సత్తా చాటుకున్నాడు రానా. ప్రస్తుతం రానా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ముఖ్, బాబీ డియోల్ లతో కలిసి 'హౌస్ ఫుల్ 4' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటిదాకా హైదరాబాదులో ఉండే రానా ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి ముంబై తిరుగుతూ ఉండేవాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపు తన మకాం పూర్తిగా ముంబైకి మార్చాలని రానా ప్లాన్ చేస్తున్నాడట. దానికి కారణం 'ఏస్ ఆఫ్ స్పేస్' సెకండ్ సీజన్ కోసం రానా ను సంప్రదించారట. ఒకవేళ రానా కనుక ఈ ఆఫర్ను ఒప్పుకుంటే ఈ సీజన్ పూర్తయ్యేంత వరకు రానా ముంబైలోనే ఉండాల్సి వస్తుంది. బిగ్ బాస్ లాగా ఇది కూడా ఒక రియాలిటీ షో కావడంతో హోస్ట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పైగా రానాకి టీవీ షోలను హోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే 'నంబర్ వన్ యారి విత్ రానా' లతో హోస్ట్ గా ప్రతిభ చాటుకున్న రామ ఇప్పుడు హిందీలో కూడా షో హోస్ట్ గా మారబోతున్నాడు అన్నమాట.


లైవ్ టీవి


Share it
Top