రానా పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన రానా భార్య

Rana Wife Checked the Rumors About Rana
x

 రానా పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన రానా భార్య

Highlights

Rana Daggubati: రానా గురించి వచ్చిన పుకార్లలో నిజం లేదా?

Rana Daggubati: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు అనేదాన్ని బట్టి కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది అని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు సమంతా, అమలాపాల్, ధనుష్ వంటి చాలామంది స్టార్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు మీడియా కన్ను మిగతా పెళ్లయిన హీరో హీరోయిన్ల పై పడింది. రానా దగ్గుబాటి గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. కావాలని సోషల్ మీడియాని అవాయిడ్ చేస్తూ ఉన్న రానా వ్యక్తిగత జీవితం గురించిన కొన్ని పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రానా సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి గల కారణం తనకి మరియు తన భార్య మిహికా బజాజ్ కి మధ్య వచ్చిన మనస్పర్ధలని వారు త్వరలోనే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని మీడియా పుకార్లను గుప్పించింది. కానీ ఈ పుకార్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మిహికా నిన్న తమ రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇలా తాము ఇంకా కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పింది మిహికా. మరోవైపు ఏమీ లేకుండానే మీడియా ఇలాంటి పుకార్లను సృష్టిస్తోంది అంటూ అభిమానులు సైతం మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories