Rana Daggubati: కొత్త దర్శకుడి వేటలో దగ్గుబాటి రానా?

Rana to introduce a new director?
x

రానా దగ్గుబాటి (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Rana Daggubati: రానా దగ్గుబాటి ప్రస్తుతం జోరుమీదున్నారు. తన తదుపరి చిత్రం అరణ్య ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

Rana Daggubati: రానా దగ్గుబాటి ప్రస్తుతం జోరుమీదున్నారు. తన తదుపరి చిత్రం అరణ్య ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అలాగే మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనమ్ కోషియం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో ఓ భాగమయ్యారు. తాజాగా రానా నుంచి ఓ కొత్త అప్ డేట్ హల్ చల్ చేస్తుంది. నూతన డైరెక్టర్‌ని పరిచయం చేసేందుకు రానా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇందుకోసం రానా 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్‌తో చర్చలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని చేపట్టేందుకు నూతన దర్శకులతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. రానా దగ్గుబాటి ఈ కథ నచ్చడంతో.. సినిమా చేసేందుక సైన్ చేశాడంట. కానీ, ఇంకా డైరెక్టర్ ఫిక్స్ కాకపోవడంతో... ఆపనిలో నిమగ్నమయ్యారంట.

ఈ చిత్రంలో తగినంత వాణిజ్య అంశాలు ఉన్నాయని నివేదికలు వెల్లడవుతున్నాయి. ఈ చిత్రం షూట్ కొన్ని నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఫిక్స్ అయ్యాకే, మిగతా విషయాలు అధికారిక వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అప్ డేట్ కోసం మరిన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories