Rana Daggubati: రానా సోలో సినిమాలు ఎప్పుడంటూ అభిమానుల ఎదురుచూపు

admin1
Updated on: 18 Aug 2021 2:56 PM IST
Rana Fans are Unsaitified with his Multistarrer Movies | Rana New Movie Telugu 2021
X

రానా (ఫైల్ ఫోటో)

Rana New Movie 2021: మిగతా స్టార్ హీరోలలా కాకుండా తన రూటే సపరేటు అంటూ కేవలం కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న రానా ఈ మధ్యనే "అరణ్య" సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నారు. అయితే తాజాగా రానా మరియు పవన్ కళ్యాణ్ హీరోలుగా "భీమ్లా నాయక్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమా రీమేక్ గా తెరకెక్కనుంది. సినిమాలో ఇద్దరి పాత్రలకి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, దర్శక నిర్మాతలు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే హైలైట్ చేస్తుండడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రానా మరియు వెంకటేష్ దగ్గుబాటి కలిసి నెట్ ఫ్లెక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరోవైపు నాగచైతన్య తో కలిసి రానా మరొక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానా ఇంక సోలో సినిమాలు ఎప్పుడు చేస్తాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం రానా చేతిలో ఉన్న అన్ని సినిమాలు మల్టీస్టారర్ ప్రాజెక్టులే కావడంతో అభిమానులు రానా సింగిల్ హీరోగా మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ తన ఫ్యాన్స్ కోరిక మేరకు అయినా రానా సోలో సినిమాలలో చేస్తారో లేదో చూడాలి.

admin1

admin1

Next Story