Abhiram Daggubati: సినిమాల్లోకి రానా సోదరుడు?

Rana Daggubatis brother set to make his debut!
x

అభిరామ్ దగ్గుబాటి (ఫొటో దిహన్స్ ఇండియా)

Highlights

Abhiram Daggubati: దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి చాలా కాలంగా హీరోగా అరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు.

Abhiram Daggubati: దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి చాలా కాలంగా హీరోగా అరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అభిరామ్ దగ్గుబాటిని దర్శకుడు తేజ తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇంతకుముందు, ఈ ప్రాజెక్ట్ కోసం కొంతమంది దర్శకులను సంప్రదించాడంట. ఎట్టకేలకు డైరెక్టర్ తేజ ఖరారు అయినట్లు కనిపిస్తోంది. సురేష్ బాబు దగ్గుబాటి ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించనున్నారు. చర్చలు చివరి దశకు వచ్చాయని, త్వరలోనే ప్రాజెక్ట్ ప్రకటన వెలువడనుందని సమాచారం.

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం అందించేందుకు ఆర్‌పీ పట్నాయక్ బోర్డులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories