'అర‌ణ్య'‌కు రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అదే రోజు మరో సినిమా

అర‌ణ్య‌కు రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అదే రోజు మరో సినిమా
x
Highlights

టాలీవుడ్ కు మళ్లీ పూర్వపు రోజులు తిరిగి రానున్నాయి. కరోనాతో గత కొంత కాలంగా మూతపడిన థియేటర్లు అన్ని నెల రోజుల క్రితం తిరిగి తెరుచుకోవడం తెలిసిందే.

టాలీవుడ్ కు మళ్లీ పూర్వపు రోజులు తిరిగి రానున్నాయి. గత కొంత కాలంగా కరోనాతో మూతపడిన థియేటర్లు అన్ని నెల రోజుల క్రితం తిరిగి తెరుచుకోవడం తెలిసిందే. కాగా... ఈ ఏడాది తొలి రోజు నుంచి ఒక్కొ సినిమా వరుసగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి సోలో బ్రతుకే సో బెటర్, డర్టీ హరి, వి, ఓరేయ్ బుజ్టిగా, కాళికా ఇలా ఒక్కో సినిమా వరుసగా విడుదల అవుతున్నాయి. సంక్రాంతి వస్తుండటంతో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయాలని ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగా రవితేజ నటించిన క్రాక్ ఈ సంక్రాంతిని పురస్కారించుకొని థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇప్ప‌టికే షూటింగ్ జ‌రుపుకున్న కొన్ని చిత్రాలు కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించాయి. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో 100 శాతం సీట్ల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు లేఖ రాసింది. దీనిపై సానుకూల స్పంద‌న వ‌స్తుందని వారు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రానా త‌న 'అర‌ణ్య' చిత్రానికి విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు. ప్ర‌భు సాల్మ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చి 26న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించారు రానా.

కొత్త సంవ‌త్స‌రానికి సాధర‌ణ ప‌రిస్థితుల‌తో ఆహ్వానం చెబుతున్నాము. హాథీ మేరీ సాథీ, అర‌ణ్య‌, కాద‌న్ సినిమా 26న మీ ద‌గ్గ‌ర్లోని థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది అని రానా ట్వీట్ చేశారు. మార్చి 26నే నితిన్ కూడా త‌న సినిమాను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ రంగ్‌దే రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ తెలిపింది. అయితే ఇద్దరు అనుకున్నట్లుగానే సినిమాలను 26నే రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే సినీ అభిమానులు మాత్రం తెలుగు పరిశ్రమలో మళ్లీ మంచి రోజులు వచ్చాయని, స్నేహపూర్వక పోటీ ఉంటుందని భావిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories