Rana Daggubati: సుకుమార్‌ టీంతో జతకట్టనున్న రానా?

Rana Daggubati: గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న 'హిరణ్యకశ్యప' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.

Venkata Chari
Published on: 8 March 2021 4:47 PM IST
Rana Daggubati with Sukumars Associate
X

రానా దగ్గుబాటి (ఫొటో హన్స్ ఇండియా)

Rana Daggubati: గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న 'హిరణ్యకశ్యప' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. రానా ప్రస్తుతం అయ్యప్పనమ్ కౌషియం రీమేక్ లో పనిచేస్తున్నాడు. అలాగే వెంకటేష్ హీరోగా వస్తున్న దృశ్యం 2 సినిమాలోనూ రానా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాకు సంతకం చేశాడని తెలుస్తొంది. సుకుమార్ టీంలో ఒకరైన దర్శకుడు వెంకీతోనూ పనిచేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం. సుకుమార్ ఇప్పటికే బుచ్చిబాబు సన ని డైరెక్షన్ లోకి దింపి ఉప్పెన తో భారీ హిట్ కొట్టించాడు. దాంతో బుచ్చిబాబు మరో సినిమాను మొదలుపెట్టాడు. ఇక సుకుమార్ టీంలోని ప్రకాశ్ తో రానా దగ్గుబాటి ఇదివరకే నాఇష్టం అనే సినిమాలో చేశాడు.

అయితే ప్రస్తుతం రానా చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇందులో ఏ ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కిస్తాడో తెలియదు. ఈ నెలలో రానా నటించిన 'అరణ్య' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంపై రానా చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి అరణ్య మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story