Rana Daggubati: మరో ప్యాన్ ఇండియా మూవీలో రానా

Rana Daggubati: రానా దగ్గుబాటి హీరోగా విశ్వశాంతి పిక్చర్స్‌ నిర్మాణంలో సీహెచ్‌ రాంబాబుతో కలిసి ఆచంట గోపీనాథ్‌ ఈ సినిమా నిర్మించనున్నారు.

Kranthi
Published on: 1 May 2021 6:38 AM IST
Rana Daggubati Signs Pan India Film
X

Rana Daggubati:(File Image)

Rana Daggubati: మరో ప్యాన్ ఇండియా మూవీలో నటించేందుకు రానా దగ్గుబాటి సైన్ చేసినట్లు సమాచారం. 'టాప్‌ హీరో, దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్‌ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్‌' వంటి సినిమాలను నిర్మించిన ఆచంట గోపీనాథ్‌ ప్రస్తుతం ఓ ప్యాన్‌ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టారు. రానా దగ్గుబాటి హీరోగా విశ్వశాంతి పిక్చర్స్‌ నిర్మాణంలో సీహెచ్‌ రాంబాబుతో కలిసి ఆచంట గోపీనాథ్‌ ఈ సినిమా నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ''పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' రీమేక్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాత రానాతో మా సినిమా ప్రారంభం అవుతుంది. ఇప్పటికే కథ ఓకే అయింది. కథ, కథనం, హీరో పాత్రచిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం'' అన్నారు. కాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్‌ 'ఇమైక్క నొడిగళ్‌'ను తెలుగులో 'అంజలి సీబీఐ'గా విడుదల చేశారు ఆచంట గోపీనాథ్‌.

Kranthi

Kranthi

Next Story