Rana Daggubati: మరో పాన్ ఇండియన్ మూవీలో రానా

Rana Daggubati signs another pan-Indian project
x

రానా దగ్గుబాటి (ఫొటో ట్విట్టర్)

Highlights

Rana Daggubati: రానా ఇటీవలే 'అరణ్య' చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విఫలమైంది.

Rana Daggubati: రానా దగ్గుబాటి ఇటీవలే 'అరణ్య' చిత్రంతో ఆకట్టుకున్నాడు. అయితే ఎన్నో అంచనాలపై వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది.

ప్రస్తుతం రానా రీమేక్ మూవీతో రాబోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనమ్ కోషియం' తెలుగు రీమేక్‌లో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత, రానా మరో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ తో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

సీనియర్ నిర్మాత గోపీనాథ్ ఆచంట, రాంబాబు సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ ఇటీవలే ఈ ప్రాజెక్టును ప్రకటించారు. రానా ఇప్పటికే కథను విన్నాడని, కొన్ని మార్పులు కూడా సూచించినట్లు కూడా తెలుస్తోంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను అతి త్వరలో ప్రకటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పాన్-ఇండియన్ మూవీ గా రానున్న ఈ మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్ లో పేరిగేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, ఇతర సిబ్బంది వివరాలు అతి త్వరలో బయటకు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories