Rana Daggubati: డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్ట్ గా రానా

* సోనీ లివ్ షూటింగ్ లో పాల్గొనబోతున్న రానా

admin1
Updated on: 31 Oct 2021 2:00 PM IST
Rana Daggubati Playing Role as WWE Artist in Advertising Campaign
X

డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్ట్ గా రానా

Rana Daggubati: గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఓటీటీలలో సోనీ లివ్ కూడా ఒకటి. ఈ మధ్యనే కమెడియన్ సత్య హీరోగా నటించిన "వివాహ భోజనంబు" అనే సినిమా స్ట్రీమ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది సోనీ లివ్. సందీప్ కిషన్ ఈ సినిమాని నిర్మించడమే కాక ఈ సినిమాలో ఒక క్యామియో పాత్ర కూడా కనిపించారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన ఉనికిని చాటేందుకు సోనీ లివ్ మరింత ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ని బ్రాండ్ ఎండార్స్ మెంట్ కోసం ఎంపిక చేసుకుంది.

తాజాగా సోనీ లివ్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కి సంబంధించిన ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు రానా. ఈ క్యాంపెయిన్ లో యాడ్ లో భాగంగా రానా ఒక డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆర్టిస్ట్ లాగా కనిపించబోతున్నారు. మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఒక ఒక యాడ్ లో కూడా కనిపించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే బాటలో రానా కూడా వెళ్ళిపోతున్నారు. ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న రానా తమ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో తమకు మరింత పేరు వస్తుందని సోనీ లివ్ వారు ఆశిస్తున్నారు.

admin1

admin1

Next Story