Corona Effect‌: 'విరాటపర్వం' విడుదల వాయిదా

Virataparvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబో లో వస్తున్న సినిమా 'విరాటపర్వం'. వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది.

Venkata Chari
Published on: 14 April 2021 9:49 PM IST
Virataparvam Movie Release Postponed
X

విరాటపర్వం విడుదల వాయిదా (ఫొటో ట్విట్టర్)

Virataparvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకండ్ వేవ్ తో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి సెగ మొదలైంది. ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్ జగదీష్ వంటి పలు చిత్రాలు వాయిదా పడ్డాయి.

తాజాగా విరాటపర్వం కూడా పోస్ట్‌ పోన్ అయింది. ఈ మేరకు రానా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశాడు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను వెల్లడిస్తామని తెలిపాడు.

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్‌ చేసిన పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

హీరో రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌లో నటిస్తున్నాడు. వీటితోపాటు సుకుమార్‌ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో 1940 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్టోరీతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story