షారుఖ్ ఖాన్ సినిమాలో తెలుగు హీరో

Shah Rukh Khan: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు నటీనటులు మరియు డైరెక్టర్ల పై బాలీవుడ్ ప్రేక్షకులలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 9:00 PM IST
Rana Daggubati Key Role in Shah Rukh Khan Film
X

షారుఖ్ ఖాన్ సినిమాలో తెలుగు హీరో

Shah Rukh Khan: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు నటీనటులు మరియు డైరెక్టర్ల పై బాలీవుడ్ ప్రేక్షకులలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించగా వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం మరొక బాలీవుడ్ సూపర్ స్టార్ ఇప్పుడు తెలుగు సెలబ్రిటీల పై ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ చేతిలో ఇప్పుడు కొన్ని బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు "జవాన్" అనే టైటిల్ ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ఒక సౌత్ ఇండియన్ సెలబ్రిటీ ని ఎంపిక చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుందట.

అయితే ఈ అవకాశం రానా దగ్గుబాటికి దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన రానా కు పెద్దగా బ్రేక్ మాత్రం రాలేదు. తాజాగా ఇప్పుడు షారుక్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా పైన తన ఆశలన్నీ పెట్టుకున్నారు రానా. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story