Rana Daggubati Brand Ambassador: ఓటీటీ ప్రమోషన్స్ లోకి దిగిన రానా

* సోనీ లివ్ కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ త్వరలో జరగబోతోంది

admin1
Published on: 26 Oct 2021 2:04 PM IST
Rana Daggubati is the New Brand Ambassador to OTT Platform of SonyLIV | Rana Daggubati Brand Ambassador
X

రానా దగ్గుబాటి (ఫైల్ ఫోటో)

Rana Daggubati Brand Ambassador - Sony LIV: ఇప్పటికీ పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ దిగ్గజమైన నెట్ఫ్లిక్స్ కూడా తెలుగు కంటెంట్ ని అందిస్తోంది. ఇక తాజాగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫాం సోనీ లివ్. కమెడియన్ సత్య హీరోగా నటించిన "వివాహ భోజనంబు" అనే ఒక కామెడీ సినిమా సోనీ లివ్ లో విడుదలై మంచి హిట్ అయ్యింది.

సందీప్ కిషన్ ఈ సినిమాని నిర్మించడమే కాక ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా పోషించారు. ఇక తాజా సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఉనికిని చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సోనీ లివ్ ఇప్పుడు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ని తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సోనీ లివ్ కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ త్వరలో జరగబోతోంది. వీరికి బ్రాండ్ అంబాసిడర్ గా మారినా రానా త్వరలోనే అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉన్న రానా దగ్గుబాటి తమ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే వారికి ప్లస్ అవుతుంది అని సోనీ లివ్ వారు రానా ను సంప్రదించారు.

ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "అరణ్య" సినిమాలో కనిపించిన రానా ఇప్పుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో "విరాటపర్వం" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా "భీమ్లా నాయక్" సినిమా కూడా త్వరలో తెరకెక్కనుంది.

admin1

admin1

Next Story