Rana Daggubati: అన్నిటి కంటే కథ ఇంపార్టెంట్ అంటున్న రానా

* స్టార్ అవ్వాలన్నా స్టార్ గా ఉండాలన్నా అదే కావాలి అంటున్న రానా

admin1
Updated on: 26 Oct 2021 2:40 PM IST
Rana Daggubati is Says Story is Important in any Movie
X

రానా (ట్విట్టర్ ఫోటో)

Rana Daggubati: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ మధ్యనే "అరణ్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విడుదలకు ముందు వరకు రానా ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం అంచనాలు అన్నిటిని కూల్చి వేస్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అయితే సినిమా హిట్ అయినప్పుడు కంటే ఫ్లాప్ అయినప్పుడు మాత్రమే నేర్చుకోవడానికి చాలా ఉంటుందని అంటున్నారు రానా. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో "భీమ్లా నాయక్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రానా. ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా కథ మొత్తం మేల్ ఈగో చుట్టూ నడుస్తుందని తెలుగు ప్రేక్షకులకి ఇది ఒక కొత్త రకం సినిమా అని అన్నారు.

ఇక ఈ సినిమా కాకుండా రానా వెంకటేష్ తో కలిసి ఒక డిజిటల్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు కథ కూడా ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుందని రానా చెబుతున్నారు. స్టార్ అవ్వాలన్నా స్టార్ గా కంటిన్యూ అవ్వాలి కంటెంట్ తో అభిమానులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం అని అంటున్న రానా ప్రస్తుతం డైరెక్టర్లు డిమాండ్ చేసేది అభిమానులు ఆసక్తి చూపించేది కథపై మాత్రమే అంటున్నారు. నేపోటిజం గురించి మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండాలంటే హార్డ్ వర్క్ ముఖ్యము కానీ ఏ కుటుంబం నుంచి వచ్చాను అనేది అవసరం లేదు అని చెప్పారు.

admin1

admin1

Next Story