Rana Daggubati: సీక్వెల్ సినిమాతో బిజీ కానున్న రానా

Rana Daggubati: ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి...

admin1
Published on: 3 March 2022 12:02 PM IST
Rana Daggubati Going to Act in Leader Movie Sequel | Tollywood News Today
X

Rana Daggubati: సీక్వెల్ సినిమాతో బిజీ కానున్న రానా

Rana Daggubati: ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి "భీమ్లా నాయక్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగులను అందించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యాప్పనుం కోషియం" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

డానియల్ శేఖర్ పాత్రలో రానా అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక మరోవైపు "రానా నాయుడు" అనే ఒక నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇక మరో వైపు వెంకటేష్ తో కలిసి ఒక అమెరికా టీవీ సిరీస్ రీమేక్లో కూడా నటిస్తున్నారు రానా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. తన సూపర్ హిట్ సినిమా "లీడర్" కి త్వరలోనే సీక్వెల్ రాబోతుందని ప్రకటించారు.

2010లో రానా హీరోగా నటించిన మొదటి సినిమా "లీడర్". శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూ లను అందుకుంది. తాజాగా శేఖర్ కమ్ముల ఈ చిత్ర కథ ను రాస్తున్నారని, అప్పుడప్పుడు కలిసి 2, 3 సన్నివేశాలు చెప్పి వెళ్ళి పోతూ ఉంటారు అని రానా నవ్వేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

admin1

admin1

Next Story