Bheemla Nayak Movie: డెనియల్ శేఖర్‌గా కనిపించనున్న రానా

Rana Daggubati Bheemla Nayak Movie Introduce Promo Released Today 20 09 2021
x

డెనియల్ శేఖర్‌గా కనిపించనున్న రానా (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* భీమ్లా నాయక్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ * రానా పాత్రకు సంబంధించిన ఇంట్రడ్యూస్ ప్రొమో రిలీజ్

Bheemla Nayak Movie: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా డెనియల్ శేఖర్‌గా రానా కనిపించనున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ కి రీమేక్‌గా తెలుగులో భీమ్లా నాయక్‌గా తెరకెక్కుతోంది. డెనియల్ శేఖర్‌ ఇంట్రడ్యూస్ ప్రొమోను మూవీ టీం రిలీజ్ చేసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యమేనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీ 2022 జనవరి 12న విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories