Aranya Trailer: రానా 'అరణ్య' ట్రైలర్ రిలీజ్

Aranya Trailer: ప్రతీ సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా దగ్గుబాటి. విలక్షణ పాత్రలతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు.

Venkata Chari
Updated on: 3 March 2021 9:26 PM IST
Ranas Aranya Trailer Released
X
రానా దగ్గుబాటి ( ఫోటో యూట్యూబ్)

Aranya Trailer: ప్రతీ సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా దగ్గుబాటి. విలక్షణ పాత్రలు ఎంచుకొంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఈసారి ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అరణ్య'. మనుషుల దురాశ, ఏనుగుల అవసరాలకు మధ్య జరిగే పోరాటాలా నేపథ్యంలో అరణ్య సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా ఏనుగులను రక్షించే ఓ మావటివాడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ అరణ్య ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఏనుగులు మనకంటే ఎంతో తెలివైనవి. ఎంతో భావోద్వేగం కలవి... అంటూ మొదలవుతుంది ఈ ట్రైలర్‌. రానా చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగులో 'అరణ్య' పేరుతో వస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Venkata Chari

Venkata Chari

Next Story