అప్పటిదాకా నరేష్ కి విడాకులు ఇవ్వను అంటున్న రమ్య రఘుపతి

* ఇంతకుముందు కూడా నరేష్ కి ఎఫైర్లు ఉండేవి అంటున్న నరేష్ మూడవ భార్య

Dhatripriya
Published on: 17 Jan 2023 3:49 PM IST
Ramya Raghupathi Says She Will Not Divorce Naresh
X

అప్పటిదాకా నరేష్ కి విడాకులు ఇవ్వను అంటున్న రమ్య రఘుపతి

Ramya Raghupathi: సీనియర్ నటుడు నరేష్ మరియు నటి పవిత్ర లోకేష్ ల ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు కూడా వీరిద్దరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి నరేష్ కి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా రమ్య రఘుపతి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తనకు విడాకులు ఇచ్చే ఉద్దేశం ఇప్పుడే లేదని చెప్పుకొచ్చారు.

"నరేష్ మూలంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా చైల్డ్ గార్డియన్ షిప్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నేను డొమెస్టిక్ వయోలెన్స్ కేస్ తో పాటు నాకు నా బిడ్డకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని కూడా కేసు వేశాను," అని అన్నారు రమ్య రఘుపతి. తన కొడుకు జీవితం తనకు చాలా ముఖ్యమని అందుకే న్యాయం కోసం తాను పోరాడుతున్నానని అప్పటిదాకా డివర్స్ పేపర్స్ మీద సైన్ చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు రమ్య రఘుపతి. ఇక ఈ మధ్యనే నరేష్ విడుదల చేసిన ఒక వీడియో గురించి మాట్లాడుతూ, "నరేష్ మిగతా ఆడవాళ్ళతో దగ్గరగా ఉంటూ నన్ను టీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నాకు కావాల్సింది నా కొడుకు సెక్యూరిటీ మాత్రమే.

నరేష్ కి ఇప్పటికే చాలా ఎఫైర్ లు ఉన్నాయి. మా అత్తగారు ఉన్నప్పుడు నన్ను ఓదార్చేవారు. నరేష్ దొరికిపోయిన ప్రతిసారి ఒక రెండు మూడు నెలలు బాగుండేవాడు. తర్వాత మళ్ళీ మొదలుపెట్టేవాడు. నేను లేనప్పుడు అడిగే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడే పవిత్ర అతనికి దగ్గర అయింది. కానీ ఇతను ఎలాంటి మనిషి నేను మా పేరెంట్స్ కి కూడా చెప్పలేదు. ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు కోర్టులో తేల్చుకుంటాను," అని అన్నారు రమ్య రఘుపతి.

Dhatripriya

Dhatripriya

Next Story