Ramya Krishnan: డబ్బింగ్ పనుల్లో బిజీ అయిన రమ్య కృష్ణ

Ramya Krishnan: డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన రమ్య కృష్ణ

Jyothi
Published on: 29 Oct 2022 9:12 AM IST
Ramya Krishnan is Busy With Dubbing Work
X

Ramya Krishnan: డబ్బింగ్ పనుల్లో బిజీ అయిన రమ్య కృష్ణ

Ramya Krishnan: బాహుబలి తో మంచి క్రేజ్ తెచ్చుకున్న రమ్యకృష్ణ మళ్లీ సినిమాల్లో తన జోరు కనబరుస్తున్నారు. ఈమధ్యనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన "లైగర్" సినిమాలో కూడా పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన రమ్యకృష్ణ మళ్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి "జైలర్" సినిమాలో నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో వున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ భర్త దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న "రంగమార్తండ" లోనూ రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరాఠీ మూవీ `నట్ సమ్రాట్` ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత కాలం మధ్యలో ఆగిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక కృష్ణవంశీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రకాష్ రాజ్ తన పోర్షన్ ని పూర్తి చేయగా బ్రహ్మానందం కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. రమ్యకృష్ణ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారట. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత చేస్తున్న ఈ సినిమా పై కృష్ణ వంశీ తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా కృష్ణ వంశీ ఆశలను ఏ మేరకు నిలబెడుతుందో వేచి చూడాల్సిందే.

Jyothi

Jyothi

Next Story