logo
సినిమా

Chiranjeevi: చిరు చెల్లెలిగా కనిపించబోతున్న ఒకప్పటి హీరోయిన్

Ramya Krishna Going to be Play the Chiranjeevi Sister Role
X

మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటించనున్న ఒకప్పటి హీరోయిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Chiranjeevi: చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతున్న రమ్యకృష్ణ

Chiranjeevi: ఒకవైపు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో "లూసిఫర్" సినిమా రీమేక్ తో కూడా బిజీగా ఉన్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను ఖరారు చేసారు దర్శనిర్మాతలు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిన విషయమే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం రమ్యకృష్ణ ని ఎంపిక చేశారట.

నిజానికి చిరంజీవి, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. "అల్లుడా మజాకా", "ముగ్గురు మొనగాళ్లు", "ఇద్దరు మిత్రులు", వంటి సూపర్ హిట్ సినిమాలలో చిరంజీవి రమ్యకృష్ణ జంటగా కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వెండితెరపై అన్నాచెల్లెళ్లు గా కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఎన్వీ ప్రసాద్ మరియు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

Web TitleRamya Krishna Going to be Play the Chiranjeevi Sister Role
Next Story