Jaya Prada: జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్

Jaya Prada: తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా వేసిన రాంపూర్ కోర్టు

Jyothi
Published on: 17 Oct 2023 7:44 AM IST
Rampur Court issues Non-Bailable Warrant against Jaya Prada
X

Jaya Prada: జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ 

Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 21కి వాయిదా వేసింది. జయప్రదపై ఈ ఉల్లంఘన కేసు 2019లోనే స్వార్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. దీంతో జయప్రదపై కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. గత ఎన్నికల్లో రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద.. సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Jyothi

Jyothi

Next Story