RGV New Movie Vyuham: నెట్టింట దుమారం రేపుతున్న ఆర్జీవీ వ్యూహం స్టిల్స్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి పై సినిమా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆర్జీవీ తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేశారు.

Dhatripriya
Updated on: 2 Jun 2023 6:00 AM IST
RGV New Movie Vyuham: నెట్టింట దుమారం రేపుతున్న ఆర్జీవీ వ్యూహం స్టిల్స్
X

RGV New Movie Vyuham: నెట్టింట దుమారం రేపుతున్న ఆర్జీవీ వ్యూహం స్టిల్స్

RGV Political Movie: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన సినిమాతో రాజకీయ దుమారానికి సిద్ధమయ్యారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి పై సినిమా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆర్జీవీ తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జగన్ మోహన్ రెడ్డి పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, భారతి పాత్రలో మాసన రాధకృష్ణన్ నటిస్తున్నారు.

ఏపీలో జరుగుతున్న రాజకీయాల ఆధారంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి రాంగోపాల్ వర్మ గతంలోనే పలు హింట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అహంకారానాకి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రలతో నిండి ఉంటుందని ఆర్జీవీ ప్రకటించారు.

మొదటి భాగం వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే రెండోభాగం శపథంతో మరో షాక్ ఇస్తానని కూడా ఆర్జీవీ గతంలోనే అనౌన్స్ చేశారు. రాంగోపాల్ వర్మతో వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ వ్యూహం, శపథం చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తంగా వ్యూహం స్టిల్స్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన ఆర్జీవీ పూర్తి స్థాయి సినిమాతో ఇంకెంత దుమారం రేపుతారో చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story