RGV Vyooham: రెండు పార్ట్‌లుగా సీఎం జగన్‌ బయోపిక్‌.. వ్యూహం, శపథం రిలీజ్‌ డేట్స్‌ చెప్పేసిన ఆర్జీవీ

RGV Vyooham: నవంబర్‌ 10న వ్యూహం.. జనవరి 25న శపథం మూవీ రిలీజ్‌

Shekhar G
Published on: 11 Oct 2023 1:43 PM IST
Ramgopal Varma Announced The Release Dates Of  Vyooham
X

RGV Vyooham: రెండు పార్ట్‌లుగా సీఎం జగన్‌ బయోపిక్‌.. వ్యూహం, శపథం రిలీజ్‌ డేట్స్‌ చెప్పేసిన ఆర్జీవీ

RGV Vyooham: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం.. ఏపీలో ఏర్పడ్డ పరిస్థితులు, వైఎస్ జగన్ పాదయాత్ర, ఆయన ఎలా సీఎం అయ్యారనే వాస్తవిక సంఘటన ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నారు వివాదాస్పద డైరెక్టర్‌ వర్మ. అయితే.. ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ ఒకటి వైరల్ అవుతోంది. వ్యూహం సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ సినిమా మొదటి భాగానికి వ్యూహం అని, సెకండ్‌ పార్ట్‌కు శపథం అని టైటిల్స్‌ను ఫిక్స్‌ చేశారు.

తాజాగా.. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను కూడా ప్రకటించారు ఆర్జీవీ. మొదటి భాగంగా వస్తున్న వ్యూహం సినిమా నవంబర్‌ 10న, రెండో భాగంగా వస్తున్న శపథం జనవరి 25న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండు కొత్త పోస్టర్లను కూడా రిలీజ్‌ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఈ పోస్టర్లు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వ్యూహం సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు.. ఈ వ్యూహం సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది.

Shekhar G

Shekhar G

Next Story