Ramesh Verma: రవితేజ పాత్ర గురించి సస్పెన్స్ అంటున్న రమేష్ వర్మ

Ramesh Verma: రవితేజ పాత్ర గురించి సస్పెన్స్ అంటున్న రమేష్ వర్మ

admin1
Updated on: 8 Feb 2022 8:00 PM IST
Ramesh Verma Talks about Ravi Tejas Role in Khiladi Movie
X

Ramesh Verma: రవితేజ పాత్ర గురించి సస్పెన్స్ అంటున్న రమేష్ వర్మ

Ramesh Verma: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ త్వరలోనే "ఖిలాడీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "క్రాక్" సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో డింపుల్ హాయతి మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రమేష్ వర్మ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర డైరెక్టర్ రమేష్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రవితేజ పాత్ర ఎలా ఉండబోతోందో చెబుతున్నా రమేష్ వర్మ కు ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది.

రమేష్ వర్మ దానికి తనదైన స్టైల్ లో జవాబు ఇచ్చారు. రమేష్ వర్మ సినిమాలో రవితేజ ది డ్యూయల్ రోల్ లేక ట్రిపుల్ రోల్ అని చెప్పకూడదని అలా చెప్పటం వల్ల సినిమాలో ఉండే ఫ్రెష్ నెస్ పోతుందని. ప్రెస్స్ వాళ్లు అదే విషయాన్ని స్ట్రెస్ చేస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టించేస్తారని అన్నారు రమేష్ వర్మ. ఇక ఈ చిత్ర ట్రైలర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ట్రైలర్ అనుకున్న స్థాయిలో లేదని యావరేజ్ గా మాత్రమే ఉందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

admin1

admin1

Next Story