Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. చివరి చూపుకు మహేశ్‌ దూరం..

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే జరిగాయి.

Arun Chilukuri
Published on: 9 Jan 2022 4:00 PM IST
Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam
X

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. చివరి చూపుకు మహేశ్‌ దూరం..

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే జరిగాయి. సినీ ప్రముఖులు రమేశ్ కు ఘన నివాళుర్పించారు. జూబ్లీహిల్స్‏లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. రమేశ్‌ బాబు కుమారుడు జయకృష్ణ చితికి నిప్పు పెట్టి తుది వీడ్కోలు పలికారు. కోవిడ్‌ నిబంధనలతో అతికొద్దిమందితో అంత్యక్రియలు పూర్తి చేశారు.

మరో దురదృష్టం ఏంటంటే.. ఇటీవల కరోనా బారిన పడ్డ మహేశ్ బాబు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న కారణంగా అన్నగారి చివరిచూపులకు కూడా నోచుకోలేకపోయారు. తన సోదరుడు రమేష్‌ బాబు ఆకస్మిక మృతిపట్ల నటుడు మహేశ్‌ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రమేష్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story