మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, శంకర్ కాంబోలో మూవీ ఫిక్స్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు పండగ చేసుకునే కబురు ఒకటి వచ్చింది.

Samba Siva Rao
Published on: 12 Feb 2021 7:43 PM IST
RamChanran Shankar
X

రాంచరణ్ 

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు పండగ చేసుకునే కబురు ఒకటి వచ్చింది. దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ‌్ నటిస్తున్నట్లు గతంలో సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. కాగా.. ఇప్పుడు ఆ వార్త నిజమైంది. రామ్ చరణ్ స్వయంగా తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. శుక్రవారం చెర్రి ట్వీట్‌ చేస్తూ.. శంకర్‌ సార్‌ వంటి సినీ మేధావి దర్శకత్వంలో నా చిత్రం కూడా ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్‌ చేశారు.

ఎస్‌వీసీ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇది 50వ చిత్రం కాగా.. శంకర్‌ డెరెక్షన్ లో ఇది15వ చిత్రం అంటూ రామ్‌చరణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేగాక ఈ చిత్రం ఎప్పుడేప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెర్రీ తెలిపాడు.

ఇక దీనిపై ఎస్‌వీసీ బ్యానర్‌ సంస్థ కూడా స్పందించింది. శంకర్‌- హీరో రాంచరణ్‌ల కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం తమ బ్యానర్ కు ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చని తెలిపింది. ఈ మూవీలోని ఇతర పాత్రధారుల ఎంపిక జరుగుతుందని వారి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఎచెప్పుకొచ్చింది. రెండు దిగ్గజాల కలయిలో వస్తున్న మొదటి చిత్రం తమ బ్యానర్‌లో 50వ చిత్రంగా రానుండం చాలా సంతోషం‍గా ఉందని, ఇది తమకు లభించిన అరుదైన గౌరవంగా ఎస్‌వీసీ సంస్థ పేర్కొంది.

ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లురి సితారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రాంచరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారు. ఆచార్య వేసవిలో రిలీజ్ కు సిద్దంకాగా.. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్రబృదం ప్రకటించింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story