సైరా టీమ్ కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్

Ruthvik
Published on: 10 April 2019 4:41 PM IST
సైరా టీమ్ కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఒకవైపు హీరోగా మరో వైపు ఈ చిత్ర నిర్మాతగా రెండు పనులను నిర్వర్తిస్తూ వస్తున్నారు రామ్ చరణ్.

తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలై చాలా కాలం దాటింది ఇంకా లేట్ అయ్యేకొద్దీ ఫాన్స్ కు సినిమా పై ఆసక్తి తగ్గిపోతుందని, అందుకనే టీం సభ్యులందరికీ కూడా రామ్ చరణ్ త్వరగా సినిమా పూర్తి చేయమని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు. షూటింగ్ త్వరగా పూర్తిచేసి సినిమాకి సంబంధించిన వీఎఫెక్స్ మరియు నిర్మాణానంతర పనులను కూడా పూర్తిచేయాలని రామ్ చరణ్ తొందర పడుతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, తమన్నా వంటి స్టార్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story