"Ramayana" Movie Update: శ్రీ రాముడిగా మహేష్, సీతగా దీపిక పదుకొనే..!?

పాన్ ఇండియా హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది

Sandeep Reddy
Updated on: 2 July 2021 3:54 PM IST
Ramayana Movie Update Mahesh Babu As Lord Rama Deepika Padukone As Seetha
X

రామాయణ మూవీ (ఫోటో: యాహు మూవీస్ కెనడా)

Ramayana Movie 2021 Cast: పాన్ ఇండియా హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న "రామాయణ" చిత్రంలో మహేష్ బాబు 'శ్రీ రాముడి' పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మహేష్ బాబుతో చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ రావణుడి పాత్రలో , బాలీవుడ్ అందాల భామ దీపిక పదుకొనే 'సీత' పాత్రలో కనిపించబోతున్నారు. గత కొన్నిరోజులుగా ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపికలో చిత్ర యూనిట్ బిజీ బిజీ గా గడుపుతున్నారు.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క నటీనటుల ఎంపికతో భారత చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సృష్టించబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత మధు మంతెర తో పాటు అల్లు అరవింద్ మరియు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా వట్టి బడా నిర్మాతలు చిత్ర నిర్మాణానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం అటు హిందీ, తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు తన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఈ "రామాయణ' చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ "బాహుబలి" తో పాన్ ఇండియా హీరోగా పేరు పొందగా, "లైగర్' చిత్రంతో విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా హీరో రేస్ లో ఉన్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story