Ram Pothineni: "వారియర్" ముందు 6 కథలకి నో చెప్పిన రామ్

Ram Pothineni: "వారియర్" ముందు 6 కథలకి నో చెప్పిన రామ్

Rama Rao
Published on: 11 July 2022 3:26 PM IST
Ram Rejected Many Stories Before The Warriorr Movie | Tollywood News
X

Ram Pothineni: యువ హీరో రామ్ ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ రామ్ లింగు స్వామి దర్శకత్వంలో "ది వారియర్" సినిమాతో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జులై 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాని ఒప్పుకునే ముందు 5-6 సినిమాలకు నో చెప్పినట్లు చెప్పుకొచ్చారు రామ్.

"ఇంతకుముందు 5 - 6 పోలీస్ స్టోరీలు విన్నాను. కానీ అవేవీ నాకు నచ్చలేదు. కానీ లింగుస్వామి నెరేషన్ చాలా బాగా నచ్చింది. కథలోని ఎమోషన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యి వెంటనే ఒకే చెప్పేసాను" అని అన్నారు రామ్.అంతేకాకుండా కేవలం నెరేషన్ విన్నకే చాలా ఎక్సైట్ అయిన ప్రాజెక్ట్ ఇదే అని అన్నారు రామ్.

ఇక సినిమా షూటింగ్ సమయంలో తన వెన్నెముకకి దెబ్బ తగిలిందని, ఆ సమయంలో తన అభిమానులు తనపై చూపించిన ప్రేమ తాను ఎప్పటికీ మర్చిపోలేనని ట్విట్టర్లో అభిమానుల కామెంట్లు చదువుతూ చాలా ఎమోషనల్ అయ్యే వాడిని చెప్పిన రామ్ తన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రామ్ గురించి మాట్లాడుతూ లింగస్వామి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని కుదిరితే రామ్ తో మరొక పది సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు లింగస్వామి.

Rama Rao

Rama Rao

Next Story