RED Movie : రామ్ 'రెడ్' రిలీజ్‌కు ముందు బిగ్ న్యూస్ .. అక్కడ మాత్రం ఓటీటీలోనే

RED Movie : రామ్ రెడ్ రిలీజ్‌కు ముందు బిగ్ న్యూస్ .. అక్కడ మాత్రం ఓటీటీలోనే
x
Highlights

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘రెడ్’.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం'రెడ్'. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్నచిత్రం కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తెలుగు సహా మొత్తం 7 భాషల్లో విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత ప్రకటించారు. రామ్‌కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామని.. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠి, తమిళంతో పాటు హిందీలోకి కూడా డబ్ చేశామన్నారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ నెల 14 విడుదల కానుంది. ఇక మిగిలిన భాషల్లో ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు నిర్మాత వెల్లడించారు. తమిళ వెర్షన్‌ని మాత్రం డైరెక్ట్‌గా ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా రెడ్ సినిమా సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ.. రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోందని కృష్ణ పోతినేని అని అన్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఈ సినిమాలో కథానాయికలు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories