Ram RED movie: రామ్ 'రెడ్' సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Samba Siva Rao
Published on: 26 Dec 2020 5:12 PM IST
Ram RED movie: రామ్ రెడ్ సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

టాలీవుడ్ యువకథానాయకుడు రామ్ ఈ సంక్రాంతికి 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా 'రెడ్' సినిమాకు సంబంధించి మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా సెన్సార్ ఈరోజే పూర్తయింది. 'రెడ్' మూవీకి U/A సర్టిఫికేట్ వచ్చింది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సూపర్ హిట్ కావడంతో అదే సెంటిమెంట్ తో రానున్నారు.

ఇక రెడ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని తిరుమల కిశోర్ దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ.. ఈరోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చిందని వెల్లడించారు.

'దేవదాసు', 'మస్కా' తర్వాత సంక్రాంతికి వస్తున్న మరో సినిమా అని రవికిశోర్ తెలిపారు. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అన్ని అంశాలన్నీ సినిమాలోఉంటాయని ఆయన చెప్పారు. 'ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ, 'రెడ్'కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం అని రవికిశోర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story