Ram RED Movie Collections: 'రెడ్' 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బరిలో దిగిన సస్పెన్స్ థ్రిల్లర్ RED.

Samba Siva Rao
Published on: 17 Jan 2021 5:31 PM IST
Ram RED Movie Collections: రెడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
X

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బరిలో దిగిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ RED. రామ్ హీరోగా నటిచించిన ఈ చిత్రం విడుదలన రోజు నుంచి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ థ్రిల్లర్ మూవీపై క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఇంట్రెస్ట్ చూపించడంతో మొదటిరోజే దాదాపు 5 కోట్లు రాబట్టి రామ్ కెరీర్‌లో రెండో బెస్ట్ మూవీగా నిలిచింది. మూడురోజుల్లో 13.21 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ మూవీ.

ఏరియాల వారీగా నెట్ కలెక్షన్ చూస్తే..

నైజాంలో 92 లక్షలు, సీడెడ్‌- 48 లక్షలు, ఉత్తరాంధ్ర- 32 లక్షలు, వెస్ట్ గోదావరి- 17 లక్షలు, ఈస్ట్ గోదావరి- 25 లక్షలు, గుంటూరు- 18 లక్షలు, క‌ృష్ణా- 21 లక్షలు, నెల్లూరు- 18 లక్షలు, ఏపీ తెలంగాణలో 3రోజు కలెక్షన్స్ గ్రాస్- 5.20 కోట్లు. ఇక మొత్తంగా మూడు రోజుల్లో కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. 23.10 కోట్ల గ్రాస్, 13.21 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. RED మూవీ టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5 కోట్లు కాబట్టి మరో 1.30 కోట్లు వచ్చాయంటే సినిమా సేఫ్ జోన్‌లో పడినట్లే.

కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ‎సినిమాకు స్ర‌వంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ బాణీలు అందించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story