క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌తో హీరో రామ్ సినిమా..

Ram Pothineni to Work Next With Director Gautham Menon
x

క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌తో హీరో రామ్ సినిమా..

Highlights

రామ్ తదుపరి సినిమా కి డైరెక్టర్ ఎవరో తెలుసా?

Ram Pothineni: "ఇస్మార్ట్ శంకర్" తో మంచి హిట్ అందుకున్న తర్వాత "రెడ్" మరియు ఈ మధ్యనే విడుదలైన "వారియర్" సినిమాలతో ప్రేక్షకులను అంతగా మప్పించలేకపోయారు రామ్. అయితే ఎలాగైనా ఈసారి ఒక మంచి హిట్ అందుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ తాజాగా ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వీరిద్దరి సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా సమాచారం.

తాజాగా "వెందు తానిందతు కాడు" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ గౌతమ్ మీనన్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మధ్యనే రామ్ లింగస్వామి డైరెక్షన్లో "ది వారియర్" సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. తమిళ్ లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు రామ్. తాజాగా ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా రామ్ ఒక తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమా చేయబోతున్నారు.

మరోవైపు "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా రామ్ ఒక సినిమాని చేయబోతున్నారు. కమర్షియల్ మాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రామ్ మరియు గౌతమ్ మీనన్ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories