రీమేక్ సినిమా లైన్లో పెట్టిన రామ్

రీమేక్ సినిమా లైన్లో పెట్టిన రామ్
x
Highlights

ఇప్పటికే కొందరు తెలుగు హీరోలు తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ఇదే జాబితాలో ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా చేరనున్నాడు. తాజా...

ఇప్పటికే కొందరు తెలుగు హీరోలు తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ఇదే జాబితాలో ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా చేరనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు హీరో రామ్ ఒక తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బిజీగా ఉన్న రామ్ ఈ సినిమా పూర్తయిన తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

అరుణ్ విజయ్ హీరోగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఈ సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. తమిళంలో మాజిస్హ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ హోం బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మాత స్రవంతి రవికిషోర్ ఇప్పటికే ఈ తమిళ్ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories